![]() |
![]() |
.webp)
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ సురేఖ వాణి సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. అత్తగా, అమ్మగా, పిన్నిగా, పెద్దమ్మగా ఇలా రకరకాల సపోర్టింగ్ రోల్స్ లో ఆమె చేసే నటన అద్భుతంగా ఉంటుంది. ఈమె ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ అనే టీవీ షోతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత ఆ షో డైరెక్టర్ సురేష్ తేజని లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరికి సుప్రీత సంతానం. 2019 లో సురేఖ వాణి భర్త సురేష్ తేజ అనారోగ్యం కారణంగా మరణించారు. ఆ తర్వాత సురేఖ వాణి డిప్రెషన్ కు గురై ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. కొంతకాలం తర్వాత తనని తాను డిప్రెషన్ నుంచి బయటపడేసుకుని తన కూతురి కోసం తన మనసు మార్చుకుని ఆ బాధ నుంచి బయటపడి సింగిల్ మదర్ గా ఉంటూ ఆమెను చూసుకుంటోంది.
సోషల్ మీడియాలో కూతురు సుప్రీతతో కలిసి సురేఖ వాణి చేసే రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, డాన్స్ వీడియోలు బాగా ఫేమస్. అలాంటి సురేఖ వాణి రీసెంట్ గా తన కూతురు సుప్రీతతో కలిసి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆమె ఆ ఏడుకొండల వాడికి తలనీలాలు కూడా సమర్పించుకుంది. ఎన్నడూ లేని విధంగా సురేఖావాణి ఇలా గుండులో కనిపించి ఫాన్స్ కి షాకిచ్చింది. ఐతే తన తల నీలాలను అర్పించిన విషయం గురించి చెప్తూ " 18 ఏళ్ళ క్రితం గుండు చేయించుకున్న..అప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ లేవు. మళ్ళీ ఇన్నేళ్లకు శ్రీవారికి తలనీలాలు ఇచ్చాను. అప్పుడు మా వారి కోసం తల నీలాలు ఇచ్చాను. ఇప్పుడు ఆ పెద్దాయన కోసం ఇచ్చాను..గోవిందా గోవిందా" అంటూ ఆ శ్రీవారిని తలుచుకున్నారు సురేఖ వాణి, సుప్రీతా.
![]() |
![]() |